మరికొన్ని గంటల్లో యాత్ర2 మూవీ థియేటర్లలో రిలీజవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జీవా 8 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకోగా మమ్ముట్టి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు మరో 10 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఈ సినిమా పారితోషికాల కోసమే 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైనట్లు సమాచారం అందుతోంది. కడప, పులివెందుల లొకేషన్లలో ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను షూట్ చేశారని సమాచారం. యాత్ర2 సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో అయితే లేవు.
అయితే ఈ సినిమాకు ఆఫ్ లైన్ బుకింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. యాత్ర2 బాక్సాఫీస్ ను రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. వైఎస్ జగన్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో షర్మిల, లోకేశ్, పవన్ పాత్రలు ఉండవని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. కథకు అనుగుణంగా అవసరమైన పాత్రలు మాత్రమే ఈ సినిమాలో ఉన్నాయని మహి వి రాఘవ్ చెబుతున్నారు.
ఈ సినిమాకు (Yatra2) సెన్సార్ టాక్ బాగానే ఉండగా బిజినెస్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా ప్రీమియర్లు ఎక్కువ సంఖ్యలో ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా షోలు ప్రదర్శితం కానున్నాయి.