‘సెహరి’ హీరో దగ్గర మూడు కోట్లు నొక్కేసింది!

అధిక వడ్డి ఇప్పిస్తానంటూ సొసైటీలో పేరున్న వారితో పాటు ఇండస్ట్రీలో ప్రముఖలు కూడా మోసం చేసి వార్తల్లో నిలిచింది వ్యాపారవేత్త శిల్పా చౌదరి. ఈ వ్యవహరం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్పా చౌదరి టోకరా వేసిందని సమాచారం. ఆమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉంది. ఆమె దగ్గర రూ.2.9 కోట్లను తీసుకుంది శిల్పా చౌదరి. డబ్బు తిరిగివ్వకపోవడంతో ప్రియదర్శిని పోలీస్ కంప్లైంట్ చేసింది.

ఇదిలా ఉండగా.. శిల్పా చౌదరి బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నట్లు సమాచారం. ‘సెహరి’ సినిమాతో హీరోగా పరిచయమైన హర్ష్ కనుమిల్లితో శిల్పా స్నేహం చేసింది. స్థలం అమ్మకానికి ఉందంటూ కొంత డబ్బుని.. అప్పుగా మరో కొంత డబ్బు ఇలా మొత్తం రూ.3 కోట్లను వరకు తీసుకుంది శిల్పా చౌదరి. ఇప్పుడు ఆ మూడు కోట్లు తిరిగొచ్చేలా లేవు. అయితే ఈ విషయంలో హర్ష్ కనుమిల్లి కంప్లైంట్ చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

ఇత్తడితో పాటు శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన మరో టాప్ హీరో కూడా ఉన్నాడని సమాచారం. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. తెర వెనుక నుంచే ఈ సమస్యని పరిష్కరించుకొని.. డబ్బు వసూలు చేయాలని చూస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus