‘జాంబీరెడ్డి’ బ్యూటీకి క్రేజీ ఆఫర్!

2021లో ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు రవితేజ. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కరోనా టైంలో ఇండస్ట్రీకి జోష్ ని తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను రీసెంట్ గానే పూర్తి చేశారు. ఆ వెంటనే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు శరత్ మండవ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

ఇప్పుడు మరో కొత్త సినిమాను మొదలుపెడుతున్నారు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటించబోతున్నారు. జనవరి 14న ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అలానే విలన్ పాత్ర కోసం కూడా ఓ హీరోయిన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? దక్ష నగర్కార్. తేజ డైరెక్ట్ చేసిన ‘హోరా హోరీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ.

Actress Daksha Nagarkar,Daksha Nagarkar Stills,Daksha Nagarkar Photoshoot

ఆ తరువాత రెండు, మూడు సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపుని సంపాదించలేకపోయింది. గతేడాది విడుదలైన ‘జాంబీరెడ్డి’ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ఇప్పుడు రవితేజ సినిమాలో ఈమెకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుందట. మెయిన్ విలన్ గా మరొకరు ఉంటారట. కానీ దక్ష రోల్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా.. ఈ బ్యూటీకి బ్రేక్ దక్కుతుందేమో చూడాలి!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.