Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి
- January 23, 2026 / 08:07 PM ISTByPhani Kumar
టాలీవుడ్లో టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నప్పటికీ.. మన దర్శకనిర్మాతలు వేరే భాషలో పాపులర్ అయిన వాళ్లనే ఏరి కోరి తీసుకొస్తుంటారు. ‘దూరపు కొండలు నునుపు.. పొరిగింటి పుల్లకూర రుచి’ అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ విషయాన్ని ముందుగానే గమించిన కొంతమంది వేరే భాషల్లో అవకాశాలు తెచ్చుకుని టాప్ ప్లేస్ కి వెళ్లారు.అలాంటి వారిలో జరీనా వాహాబ్(Zarina Wahab) ఒకరు.
Zarina Wahab
ఈమె బాలీవుడ్లో పాపులర్ నటి.కానీ ఈమె తెలుగు రాష్ట్రాలకి చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలీదు. అవును జరీనా వాహాబ్.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంకి చెందిన వ్యక్తి. మొదట్లో తెలుగులో ‘గాజుల కిష్టయ్య’ ‘అమర ప్రేమ’ ‘హేమా హేమీలు’ వంటి సినిమాల్లో నటించారు. తర్వాత హిందీలో ఎక్కువ ఆఫర్లు రావడంతో అటు మళ్ళారు. అలాంటి ఈమెను తిరిగి తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చారు రాంగోపాల్ వర్మ. ‘రక్త చరిత్ర’ తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత ‘రక్త చరిత్ర 2’ ‘విరాటపర్వం’ ‘దసరా’ వంటి సినిమాల్లో నటించారు. ‘దేవర పార్ట్ 1’ లో ఎన్టీఆర్ తల్లిగా కూడా చేసింది ఈమెనే.అయితే 2026 సంక్రాంతికి ఆమె 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ‘ది రాజాసాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ నాయనమ్మ పాత్రలో చాలా బాగా నటించింది. ఈ సినిమాలో హీరోకంటే కూడా అతి ముఖ్యమైన పాత్ర ఈమెదే.
అయితే ‘రాజాసాబ్’ ప్లాప్ అవ్వడంతో.. జరీనా వాహాబ్ పాత్రకి అనుకున్న స్థాయిలో అప్రీషియేషన్ రాలేదు. అయితే తర్వాత వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో నటించింది. ‘రాజాసాబ్’ తో పోలిస్తే ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో జరీనా పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువే. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’కి మెయిన్ హైలెట్ జరీనా వాహాబ్ కి నయనతారకి మధ్య వచ్చే ఒక సన్నివేశం.
కోడలు ఎలా ఉండాలో, ముఖ్యంగా భర్తతో ఎలా మెలగాలో ఈమె వివరించే సన్నివేశం.. సినిమాకి బాగా హైలెట్ అయ్యింది. సినిమాపై అప్పటివరకు ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ని ఆ సీన్ తీసేస్తుంది అనే చెప్పాలి. అయితే జరీనా ‘రాజాసాబ్’ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా సందడి చేసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ లో ఈమె కనిపించలేదు. కానీ సినిమాలో ఈమె పాత్రే హైలెట్ అయ్యింది అని చెప్పాలి.
పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?














