Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మంచి సినిమాలే .. కానీ

మంచి సినిమాలే .. కానీ

  • August 3, 2016 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి సినిమాలే .. కానీ

ఒక చిత్రం విజయం సాధించాలంటే .. బాగుంటే సరిపోదు. అన్ని పరిస్థితులు అనుకూలించాలి. రిలీజ్ అయినా సమయం, అప్పటి సామాజిక సమస్యలు, దొరికిన థియేటర్లు, పబ్లిసిటీ .. ఇలాంటి ఎన్నో అంశాలు మూవీ విజయానికి తోడ్పడతాయి. అలా సినిమా బాగుండి.. ఫెయిల్ అయినా కొన్ని తెలుగు చిత్రాల గురించి ఫోకస్.

1. ఖలేజాMahesh Babu, Khalejaమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన రెండో సినిమా ఖలేజా. ఇందులో ప్రిన్స్ ట్యాక్సీ డ్రైవర్ గా నటించారు. మహేష్ లోని కామెడీ టైమింగ్ ని పూర్తిగా వెలికి తీసిన ఘనత త్రివిక్రమ్ కే దక్కింది. ప్రతి డైలాగ్ నవ్వులు పూయించింది. రాజస్థాన్ నేపథ్యంలో సాగే కథ, అద్భుతమైన పాటలు, మంచి ఫైట్లు అన్నీ ఉన్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా విజయం సాధించలేక పోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చలేరు.

2. నేనింతేNeninthe, Ravitejaటాప్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినీ రంగం నేపథ్యంలో తీసిన సినిమా “నేనింతే”. పరిశ్రమలోని కష్టనష్టాలను కళ్లకు కడుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా తెరకెక్కించారు. ఇందులో మాస్ మహారాజ్ రవి తేజ నటన అందరి ప్రశంసలు అందుకుంది. అయినా హిట్ జాబితాలోకి వెళ్లలేక పోయింది.

3 . వెన్నెలVennela Kishore, Vennela Movieవిదేశాల్లో చదువుకోవాలని కలలు కనే కొంతమంది యువకుల మధ్య నడిచే సరదా సంఘటనల సమాహారమే వెన్నెల. భారీ ఫైట్స్, సీనియర్ నటులు లేకున్నా .. సినిమా చూస్తున్న సేపు హాయిగా ఉంటుంది. ఇందులో నవ్వులు పూయించిన కిషోర్ కి.. వెన్నెల కిషోర్ గా గుర్తింపు వచ్చింది. చిన్ని చిత్రం ఎదుర్కొనే కష్టాలను అధిగమించలేక థియేటర్ల నుంచి వెనక్కి వచ్చేసింది.

4. గగనంGaganam, Gaganam Movieహైజాక్ అయినా విమానాన్ని, అందులో ఉన్న ప్రయాణికులను ఎలా రక్షించారు అనే కథ తో రూపుదిద్దుకున్న సినిమా గగనం. దాదాపు సినిమా అంతా విమానంలో నడిచినా, పాటలు లేకపోయినా .. ప్రతిక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కింగ్ నాగార్జున నటన సినిమాకు ప్లస్. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వంటి ఎంతో మంది సీనియర్ నటులతో ఈ సినిమాను రాధాకృష్ణ చక్కగా తీశారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినా విజయ తీరాన్ని చేరుకోలేక పోయింది.

5. ఐతేAithe, Aithe Movieనూతన నటులతో చంద్ర శేఖర్ యేలేటి తీసిన డిఫరెంట్ ఫిలిం ఐతే. ఇందులో పాటలు, సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. యువతను బాగా ఆకట్టుకుంది. ఆర్ధికంగా లాభాలను తెచ్చిపెట్టింది. అయినా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరలేకపోయింది.

6. బ్రోకర్Broker, Broker Movieసంగీత దర్శకుడు ఆర్.పీ.పట్నాయక్ నటించి దర్శకత్వం వహించిన సినిమా బ్రోకర్. రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ తీసిన ఈ చిత్రం మంచి సినిమాగా పేరు సంపాదించుకుంది. కమర్షియల్ గా హిట్ సాధించలేక పోయింది.

7. నేను మీకు తెలుసా ?Nenu Meeku Telusa Movieమంచు మనోజ్ నటనకు ఎక్కువ మార్కులు పడిన చిత్రం “నేను మీకు తెలుసా?”. ఇందులో మనోజ్ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిగా నటించి అందరితో అభినందనలు అందుకున్నాడు. పాటలు కథకు బాగా యాప్ట్ అయ్యాయి. కానీ చిత్రబృందానికి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు.

8. అందాల రాక్షసిAndala Rakshasi Movieఎంతలా ప్రేమించావు అంటే సమాధానం చెప్పలేము. ఇదే టాపిక్ తో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం అందాల రాక్షసి. కాబోయే పెళ్ళాం ప్రేమించిన అబ్బాయిని వెతుక్కుని వెళ్లి మరణించే ఓ యువకుడి స్టోరీని ఎంతో చక్కగా మలిచారు హను రాఘవపూడి. ఫ్రెష్ కథను మరింత తాజా గా అందించినా ఈ సినిమా హిట్ జాబితాలోకి చేరుకోలేక పోయింది.

9 .ప్రస్థానంPrasthanam, Prasthanam Movieతెలుగు చిత్రాల్లో ప్రస్థానం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. 2010 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సినీ ప్రియుల అందరి మనసులను గెలుచుకుంది. నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో సాయి కుమా ర్ , శర్వానంద్ ల నటన హైలెట్. దేవా కట్ట ప్రస్థానం సినిమాను కళా ఖండంగా తీర్చి దిద్దారు. వివిధ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ అనే మాటకు దూరంగానే నిలిచింది.

10. ఆ నలుగురుAa Naluguru, Aa Naluguru Movieనట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తన శైలికి భిన్నంగా నటించిన సినిమా ఆ నలుగురు. తన వయసుకన్నా పెద్దవాడిగా, డీ గ్లామరస్ గా రఘురాం పాత్రలో కంట తడి పెట్టించారు. మంచి చిత్రంగా అందరి నోటా కీర్తించినా .. థియేటర్లలో సీట్లు మాత్రం నిండేవి కావు. కమర్షియల్ హిట్ సాధించలేక పోయింది. ఈ సినిమా టీవీలో వచ్చిన ప్రతి సారి రేటింగ్ మాత్రం ఎక్కువగా వస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Naluguru
  • #Aa Naluguru Movie
  • #Aithe
  • #Aithe Movie
  • #Andala rakshasi movie

Also Read

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

related news

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

trending news

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

13 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

16 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

18 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

21 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

2 hours ago
హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

2 hours ago
భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

3 hours ago
Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version