Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రికార్డుల బ్రేకర్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’

రికార్డుల బ్రేకర్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’

  • August 9, 2018 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రికార్డుల బ్రేకర్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’

ఘట్టమనేని వారసుడు, టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో రికార్డులను తిరగ రాస్తున్నారు. తన కలక్షన్ రికార్డ్ లను తానే బీట్ చేస్తూ నంబర్ వన్ సింహాసనం ఫై ధీమా గా కూర్చొని ఉన్నారు.

రాజకుమారుడు

rajakumarudu

రాజకుమారుడు (1999) చిత్రంలో రాజాగా కనిపించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. తొలి సినిమా తోనే కమర్షియల్ హీరో అనిపించుకున్నారు.

మురారి

murari

ఫ్యామిలీ మొత్తాన్ని మహేష్ తన అభిమానులుగా చేసుకున్న చిత్రం మురారి. 2001 లో వచ్చిన మూవీలో మహేష్ అన్ని రకాల షేడ్స్ ని చూపించారు. సెంటిమెంట్ సీన్ లలో చక్కగా నటించి .. రాబోయే కాలంలో తనదే నంబర్ వన్ స్థానం అని సూచించారు.

ఒక్కడు

okkadu

2003లో రిలీజ్ అయిన ఒక్కడుతో కలక్షన్ల వర్షం కురిపించారు. కబడ్డీ ప్లేయర్ గా, లవర్ ని సొంతం చేసుకునే యువకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు రాబట్టింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ లు చెరిగిపోయాయి. ప్రిన్స్ తొలి సారి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.

అతడు

athadu

2005లో అతడు తో దిమ్మ దిరేగేలా చేశాడు. నంద గోపాల్, పార్ధు గా మహేష్ నటనను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేక పోయారు. పక్కా ప్రొఫిషనల్ కిల్లర్ గా రికార్డులన్నింటినీ మర్డర్ చేశారు.

పోకిరి

pokiri

అండర్ కవర్ పోలీస్ గా మహేష్ చేసిన యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పోకిరి సినిమా తో తెలుగు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటగలదని చూపించారు. అనధికారంగా 70 కోట్లు వసూల్ చేసిందని టాక్. తెలుగు సినిమా ఇన్ని కోట్లు రాబట్ట గలదా? అని సినీ పండితులు ఆశ్చర్య పోయారు.

ఖలేజా

khaleja

మాటల మాంత్రికుడితో మహేష్ చేసిన మరో సినిమా ఖలేజ. అతడులో మహేష్ ని సీరియస్ గా చూపించిన త్రివిక్రమ్ .. ఈ సినిమాలో అతడితో కామెడీ చేయించారు. మహేష్ కామెడీ టైం ఇందులో అదిరిపోతుంది. ప్రతి మాట పంచ్ లాగే ఉంటుంది. మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

దూకుడు

dookudu

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. తండ్రికి మంచి కొడుకిగా.. ఆయన కోసం ఒక రాజకీయ నాయకుడుగా, మరో వైపు ప్రియుడిగా ఒకే సినిమాలో నాలుగు షేడ్స్ ని అద్భుతంగా పలికించారు. దీంతో దూకుడు దూసుకు పోయింది. ఈ చిత్రం తో భారీ వసూళ్లు రాబట్టి నంబర్ వన్ కుర్చీలో మహేష్ ధీమాగా సెటిల్ అయిపోయారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

seethamma-vaakitlo-sirimalle-chettu

తెలుగు సూపర్ స్టార్ అయి ఉండి ఎటువంటి భేషజాలకు పోకుండా వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) చిత్రంలో చిన్నోడుగా సింపుల్ గా కనిపించి 50 కోట్లను దాటించేసారు.

శ్రీమంతుడు

srimanthudu

ఊరిని దత్తత తీసుకునే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా మహేష్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా రూ. 145 కోట్లు వసూలు చేసింది. మహేష్ “శ్రీమంతుడు”తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించారు.

బ్రహ్మోత్సవం

brahmostavam

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణం తో రూపుదిద్దుకున్న బ్రహ్మోత్సవం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.71 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.

స్పైడర్

spyder

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కలయికలో రూపుదిద్దుకున్న స్పైడర్ మూవీని ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా స్పైడర్ ఎనిమిది లక్షల డాలర్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి.

భరత్ అను నేను

bharat-ane-nenu

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి చేసిన భరత్ అను నేను మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 150 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డుల రారాజు మహేష్ బాబు అని మరోసారి నిరూపించింది.

మహర్షి

maharshi

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ వంటి బడా నిర్మాతలు నిర్మించారు. మహేష్ 25 వ సినిమాగా వచ్చిన ‘మహర్షి’ 170 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.  ఇక తన 26 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎలెమెంట్స్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మరి గోల్డెన్ జూబ్లీకి మొదటి చిత్రం కాబట్టి.. ఈ చిత్రం తో 200 కోట్ల గ్రాస్ ను రాబట్టి మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #Bharat Ane Nenu
  • #Brahmothsavam
  • #Dookudu
  • #Khaleja

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

3 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 day ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version