పాత సినిమాలను 4K కి డిజిటలైజ్ చేసి రీ- రిలీజ్ (Re-release) చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాల కంటే ఇవే ఎక్కువగా కలెక్ట్ చేస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోల మాస్ సినిమాలు లేదంటే మ్యూజిక్ బాగుండే సినిమాలు రీ- రిలీజ్లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఇండియా వైడ్ రీ- రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) సనమ్ తేరీ కసమ్ :
2016 లో వచ్చిన ఈ హిందీ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. హర్షవర్ధన్ రానే, మావ్రా హుస్సేన్ ఇందులో జంటగా నటించారు. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.9 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. కానీ ఈ ఏడాది రీ- రిలీజ్ చేయగా ఏకంగా రూ.42 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది. రీ- రిలీజ్ సినిమాల్లో ఇదే రికార్డు.
2) తుంబడ్ :
2018 అక్టోబర్ టైంలో వచ్చిన ఈ హిందీ సినిమా.. ఆ టైంలో ప్లాప్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఇటీవల రీ- రిలీజ్ అవ్వగా ఏకంగా రూ.38 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 2 ప్లేస్ లో నిలిచింది.
3) గిల్లి (Gilli) :
‘ఒక్కడు’ రీమేక్ అయిన ‘గిల్లి’ రీ- రిలీజ్లో ఏకంగా రూ.32 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. సౌత్లో వచ్చిన రీ- రిలీజ్ సినిమాల్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే.
4) మురారి (Murari) :
మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా రీ- రిలీజ్ అయిన ‘మురారి’ సినిమా రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసి.. టాలీవుడ్ రీ- రిలీజ్లలో నెంబర్ 1 మూవీగా నిలిచింది.
5) గబ్బర్ సింగ్ (Gabbar Singh) :
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా రీ- రిలీజ్ అయిన ఈ సినిమా రూ.8 కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్లో నెంబర్ 2 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది.
6) ఖుషి (Kushi) :
పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా రీ- రిలీజ్లో రూ.7.4 కోట్లు కలెక్ట్ చేసి.. ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది.
7) ఆర్య 2 (Arya 2) :
అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన స్టైలిష్ మూవీ ‘ఆర్య 2’ రీ- రిలీజ్ అవ్వగా రూ.6.7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
8) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) :
మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్ (Venkatesh Daggubati) కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ ఇటీవల రీ- రిలీజ్ అవ్వగా రూ.6.6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
9) బిజినెస్ మెన్ (Businessman) :
మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా రీ- రిలీజ్లో రూ.5.8 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది.
10) దేవదూతన్ :
ఈ మలయాళ సినిమా రీ- రిలీజ్లో రూ.5.3 కోట్లు కలెక్ట్ చేసి టాప్-10 లో ప్లేస్ సంపాదించుకుంది.
11) స్పదికం :
ఈ మలయాళ సినిమా కూడా రీ- రిలీజ్లో రూ.4.9 కోట్లు కలెక్ట్ చేసింది.
12) ఆరెంజ్ (Orange) :
‘మగధీర’ (Magadheera) తర్వాత రాంచరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘ఆరెంజ్’ సినిమా ఆ టైంలో పెద్ద డిజాస్టర్. కానీ రీ- రిలీజ్లో రూ.4.71 కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ రీ -రిలీజ్ చేయగా రూ.1.3 కోట్లు కలెక్ట్ చేసింది.
13) సింహాద్రి (Simhadri) :
ఎన్టీఆర్ (Jr NTR)– రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో ఆల్ టైం హిట్ గా నిలిచిన ఈ సినిమా రీ- రిలీజ్లో రూ.4.6 కోట్ల వరకు కలెక్ట్ చేసి రికార్డు కొట్టింది.
14) సలార్ (Salaar) :
ప్రభాస్ (Prabhas) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాని రీ- రీ-రిలీజ్ చేయగా రూ.4.3 కోట్లు కలెక్ట్ చేసింది.
15) ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) :
విశ్వక్ సేన్ (Vishwak Sen) – తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ టైంకి జస్ట్ యావరేజ్ సినిమా అనిపించుకుంది. ఆ టైంలో కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే.. సెకండ్ రిలీజ్లో రూ.3.5 కోట్లు కలెక్ట్ చేసింది.
16) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ :
సూర్య (Suriya) హీరోగా గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా రీ- రిలీజ్ అవ్వగా రూ.3.4 కోట్లు కలెక్ట్ చేసింది.
17) ఇంద్ర (Indra) :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బి.గోపాల్ (B. Gopal) కాంబినేషన్లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్. రీ- రిలీజ్లో కూడా రూ.3.38 కోట్లు కలెక్ట్ చేసింది.
18) జల్సా (Jalsa) :
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ‘జల్సా’ ని రీ- రిలీజ్ చేయగా రూ.3.2 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డులు కొట్టింది.
19) మనిచిత్రట్జు(మలయాళం) :
ఈ మలయాళ సినిమా రీ- రిలీజ్లో రూ.3 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు కొట్టింది.
20) ఒక్కడు (Okkadu) :
మహేష్ బాబు ఆల్ టైం హిట్ సినిమా అయిన ‘ఒక్కడు’ రీ- రిలీజ్లో రూ.2.4 కోట్లు కలెక్ట్ చేసింది.