ఈ మధ్యకాలంలో మళ్ళీ జనాలు థియేటర్ కు రావడం తగ్గించేశారు. పెద్ద సినిమాలు లేకపోవడం ఒక రీజన్ అయితే.. మిడ్ రేంజ్ సినిమాలు కూడా పెద్దగా మెప్పించకపోవడం మరో కారణం అని చెప్పొచ్చు. దీంతో వీకెండ్ వచ్చింది అంటే ఓటీటీలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ప్రతి శుక్రవారం థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా పెద్ద ఎత్తున సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాల కోసం అలాగే.. నచ్చిన సినిమాలను మళ్ళీ చూడటం కోసం జనాలు ఓటీటీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ వీకెండ్ కు కూడా బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) సర్దార్ : కార్తీ- రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ తమిళం & తెలుగు భాషల్లో నవంబర్ 18 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.
2) సీతా రామం : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీతా రామం’ చిత్రం హిందీ వెర్షన్ నవంబర్ 18 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
3) ఐరావతం :సీరియల్ ఆర్టిస్ట్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.
4) వండర్ విమెన్ : నదియా, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, భాషల్లో నవంబర్ 18 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
5) అనల్ మెలే పానీ తుల్ : ఈ తమిళ సినిమా నవంబర్ 18 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
6) అహ నా పెళ్ళంట : రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
7) కంట్రీ మాఫియా సీజన్ 1 : ఈ హిందీ వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
8) ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ : ఈ తమిళ టీవీ షో జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
9) గాడ్ ఫాధర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నవంబర్ 19 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సల్మాన్ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
10) హాస్టల్ డేజ్ సీజన్ 3 : ఈ హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
11) ది వయోలెన్స్ యాక్షన్ : ఈ జపనీస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
12) స్లంబర్ ల్యాండ్ : ఈ ఇంగ్లీష్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
13) కుమారి : ఈ మలయాళం మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
14) ఎలైట్ సీజన్ -6 : ఈ స్పానిష్ & ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
15) సమ్ బాడీ-1 : ఈ జపనీస్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
16) రైన్ సుప్రీం సీజన్ -1 : ఈ ఫ్రెంచ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
17) ది కప్ హెడ్ షో సీజన్ -3 : ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
18) ఇన్ సైడ్ జాబ్ సీజన్ 2 : ఈ ఇంగ్లీష్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
19) రీబర్న్ రిచ్ సీజన్ 1 : ఈ కొరియన్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
20) పెప్సీ : వేర్ ఈజ్ మై జాకెట్ : ఈ ఇంగ్లీష్ టీవీ షో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
21) 1899 : ఈ సిరీస్ ఇంగ్లీష్,స్పానిష్, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
22) టాకో క్రానికల్స్ సీజన్ -2 : ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
23) ధారావి బ్యాంకు : ఈ హిందీ మూవీ ఎం.ఎక్స్.ప్లేయర్లో స్ట్రీమింగ్ కానుంది.
24) ఆఫ్టర్ సన్ : ఈ ఇంగ్లీష్ మూవీ ముబీలో స్ట్రీమింగ్ కానుంది.