పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. భారతీయుల ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు మేకర్స్. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఆ వేడుక ఘనంగా జరిగింది. అలాగే రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అన్నిటికీ మంచి స్పందన లభించింది.
తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యు’ రేటింగ్ ను జారీ చేసింది సెన్సార్ బృందం. మైథలాజికల్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హ్యాపీగా వీక్షించొచ్చు. కాకపోతే.. ఒక్క విషయంలో ‘ఆదిపురుష్’ టెన్షన్ పెడుతుంది. అదే రన్ టైం విషయంలో. ఈ చిత్రం రన్ టైం ఏకంగా 179 నిముషాలు. అంటే 2 గంటల 59 నిమిషాల నిడివి అన్నమాట.
ఇంత నిడివి అంటే .. జనాలకి ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ మిస్ అవ్వొచ్చు. కాని రామాయణం అందరికీ తెలిసిన కథే. అయినప్పటికీ తక్కువ రన్ టైంలో వచ్చే కథ అయితే కాదు అది. మైథలాజికల్ సినిమాలు చాలా వరకు 3 గంటల పైనే నిడివి కలిగి ఉంటాయి. ‘ఆదిపురుష్’ విషయంలో వి.ఎఫ్.ఎక్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి..
రన్ టైం విషయంలో ఏమీ చేసేది లేదనే చెప్పాలి. అయితే (Adipurush) ‘ఆదిపురుష్’ కి టాక్ తో సంబంధం లేకుండా అందరూ చూసే అవకాశం ఉంది. మరి కమర్షియల్ గా ఈ మూవీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..!