Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

  • January 12, 2018 / 05:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అసాధ్యుడు’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమా ఇది. ‘అసాధ్యుడు’ చిత్రంలోని క్యారెక్టర్‌కి ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశారు. క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమైనప్పటికీ కథలోని కొత్తదనం వల్ల ఘనవిజయాన్ని అందుకుంది. అడ్వంచర్‌ సినిమాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా ‘అసాధ్యుడు’.

‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి నాంది
ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక బ్యాలేని రూపొందించారు దర్శకుడు రామచంద్రరావు. ఇందులో సూపర్‌స్టార్‌ కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామరాజు’గా నటించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ పాత్ర పోషించాలన్న కోరిక కృష్ణకు అంతకుముందే వుండేది. ఈ చిత్రంలోని బ్యాలేతో అది మరింత బలపడింది. చరిత్ర సృష్టించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్ర రూపకల్పనకు ‘అసాధ్యుడు’ చిత్రంలోని బ్యాలే నాంది పలికిందని చెప్పొచ్చు.

మొదటి సంక్రాంతి సినిమా
సంక్రాంతికి తొలిసారి విడుదలైన కృష్ణ సినిమా ‘అసాధ్యుడు’. 1968 జనవరి 12న ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించడంతో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్‌ మొదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్‌.ఆర్‌.స్వామి పరిచయం కావడం విశేషం.
‘అసాధ్యుడు’ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ ”ఈ జనవరి 12కి ‘అసాధ్యుడు’ రిలీజ్‌ అయి 50 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదట సంక్రాంతికి విడుదలైన చిత్రమిదే. అందులోనే 15 నిమిషాలు ఉండే బ్యాలేలో అల్లూరి సీతారామరాజుగా నేను యాక్ట్‌ చేశాను. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు ఫుల్‌ పిక్చర్‌ చెయ్యాలని మనసులో ఓ కోరిక వుండేది. ఈ బ్యాలేని దర్శకుడు రామచంద్రరావుగారే పిక్చరైజ్‌ చేశారు. ఆ తర్వాత ‘అల్లూరి సీతారామారాజు’ చిత్రానికి కూడా ఆయన్నే డైరెక్టర్‌గా సెలెక్ట్‌ చేసుకొని ప్రారంభించడం జరిగింది” అన్నారు.
సూపర్‌స్టార్‌ కృష్ణ, కె.ఆర్‌. విజయ, రామకృష్ణ, ముక్కామల, చలం, బాలకృష్ణ, నెల్లూరు కాంతారావు, రావికొండలరావు, పెరుమాళ్లు, సంతోష్‌కుమార్‌, రామకృష్ణ (మిస్టర్‌ మద్రాస్‌), రాజారావు, వల్లం నరసింహారావు, ఓఎస్‌ఆర్‌ ఆంజనేయులు, బాలరాజు, వాణిశ్రీ, సంధ్యారాణి, రమాప్రభ, టిజి కమలాదేవి, జ్యోతి, ఉదయలక్ష్మీ, లక్ష్మీకాంతమ్మ, పద్మలత, కోటీశ్వరి, విజయలక్ష్మీ, బేబి రోజా రమణి నటించగా, అతిథి నటులుగా చంద్రమోహన్‌, ప్రభాకరరెడ్డి, టి. చలపతిరావు నటించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: ఆరుద్ర, పాటలు: ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణరెడ్డి, దాశరథి, సంగీతం: తాతినేని చలపతిరావు, ఫొటోగ్రఫీ: వి.ఎస్‌.ఆర్‌. స్వామి, నృత్యాలు: హీరాలాల్‌, పసుమర్తి వేణుగోపాల్‌, చిన్ని-సంపత్‌, కళ: రాజేంద్రకుమార్‌, కూర్పు: ఎ.ఎస్‌.ప్రకాశం, నిర్మాతలు: నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌. హుస్సేన్‌, దర్శకత్వం: వి. రామచంద్రరావు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asadhyudu Movie
  • #Super star Krishna
  • #Super star Krishna Movies

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

related news

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

19 mins ago
Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

1 hour ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

1 hour ago
Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

2 hours ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

2 hours ago

latest news

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

3 hours ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

3 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

4 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version