అప్పటివరకు హీరోలు, నిర్మాతల కొడుకులు హీరోలుగా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు.. ఒకవేళ దర్శకరత్న దాసరి లాంటి వాళ్ల తనయులు ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులకు పెద్దగా గుర్తు లేదు కానీ.. ఎప్పుడైతే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు కోవెలమూడి ప్రకాష్ హీరోగా పరిచయమవుతున్నాడు అని ప్రకటించారో.. అప్పటినుంచి ఫోకస్ అంతా అతని మీదే పెట్టారు.. కొత్త వారితో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్ గల ఊషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ రావు నిర్మాతగా..
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మహేంద్రన్ కొడుకు జాన్ మహేంద్రన్ దర్శకుడిగా ‘నీతో’ అనే మూవీ స్టార్ట్ చేశారు.. ఈ డైరెక్టర్ అంతకుముందు శ్రీకాంత్ తమ్ముడు అనిల్ హీరోగా పరిచయమైన ‘ప్రేమించేది ఎందుకమ్మా’ తోనే ఎంటర్ అయ్యాడు.. ఇందులో మహేశ్వరి హీరోయిన్. 1999లో అలాంటి సినిమా ఒకటి వచ్చిందని చాలా మందికి తెలియదు.. 2002లో ‘నీతో’ అవకాశం వచ్చింది.. మహెక్ చాహల్‌ని హీరోయిన్‌గా తీసుకొచ్చారు.. విద్యా సాగర్ సంగీతం.. ఛోటా కె. నాయుడు కెమెరామెన్..
2022 జూన్ 27న జనాల మీదకి జాన్ వదిలిన అస్త్రం, బ్రహ్మాస్త్రం ఇది.. ‘రాఘవేంద్ర రావు కొడుకు హీరో అంట, రామోజీ రావు తీశాడంట’ అని ఆశగా హాళ్లకు వెళ్లిన వాళ్లని పరుగులు పెట్టించాడు జాన్.. ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, సునీల్ వంటి భారీ తారాగణంతో తీశారు.. కట్ చేస్తే.. విద్యా సాగర్ కంపోజ్ చేసిన రెండు పాటలు తప్ప.. థియేటర్లో కనీసం ఇంటర్వెల్ దాకా కూడా కుదురుగా కూర్చునేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు దర్శకుడు జాన్..
ఇదే అతను తెరకెక్కించిన చివరి తెలుగు సినిమా.. ప్రకాష్ తర్వాత సీనియర్ నటి షబానా అజ్మీతో ‘మార్నింగ్ రాగ’ అనే ఇంగ్లీష్ ఫిలిం చేశాడు కానీ టాలీవుడ్‌లో నటించలేదు.. దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు.. అంచనాలతో వచ్చి ఆకట్టుకోకపోవడంతో.. కేవలం ఒక్క ఫ్లాప్ వల్ల కొంతమంది కెరీర్ నాశనం అవుతుంది అని నిరూపించిన సినిమాల్లో ‘నీతో’ కూడా ఉంటుంది..