మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.2017లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థికలావాదేవీల కారణంగా ఆగిపోయి.. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓటిటిలో విడుదలైతే చూసుకోవచ్చులే అని లైట్ తీసుకున్నారు.
అయితే ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2012లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుని మొదట సెట్స్ పైకి తీసుకెళ్ళిన దర్శకుడు బి.గోపాల్ కాదు. భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడు. 2000 వ సంవత్సరం నుండీ 2010 వ సంవత్సరం వరకు ఈయన తమిళంలో చాలా సినిమాలు తెరకెక్కించాడు. అక్కడ ఇతని హవా తగ్గడంతో తెలుగులోకి వచ్చి గోపీచంద్ తో సినిమా మొదలుపెట్టాడు.
‘జగన్మోహన్ ఐపీఎస్’ పేరుతో ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టాడు.ఆయన కొంత భాగం షూటింగ్ ను తెరకెక్కించిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ సంభవించడంతో అతను ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. దాంతో నిర్మాతలు… బి.గోపాల్ తో బ్యాలన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేయించారు. తర్వాత బడ్జెట్ సమస్యలు కూడా తలెత్తాయి. దాంతో మరికొన్ని రోజులు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరాఖరికి ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్ చేయడంతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.