ఆదివారం నాడు జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే. అలానే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మొత్తం 11 మంచి ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. రాత్రికి రాత్రే ఈసీ మెంబర్ల ఫలితాలు మారిపోయాయని చెప్పారు.
ఇదే ప్రెస్ మీట్ లో పాల్గొన్న నటుడు బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని ఆయన చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోఉంటున్నానని .. అలాంటిది మోహన్ బాబు అందరిముందు బూతులు తిడుతూ అవమానించించిన చెబుతూ ఏడ్చేశారు బెనర్జీ. ఎలెక్షన్స్ లో గెలిచినందుకు అందరూ తనకు కంగ్రాట్స్ చెబుతున్నా.. ఆ సంతోషం తనకు లేదని అన్నారు. ఆరోజు ఉదయమే వందలమందిలో మోహన్ బాబు తనను బూతులు తిట్టారని..
మూడు రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నానని అన్నారు. మోహన్ బాబు తనను కొట్టడానికి మీదకు వచ్చినప్పుడు విష్ణు, మనోజ్ లు ఆపారని తెలిపారు. చాలా బాధ కలిగిందని.. ఇలా ఎందుకు బతకాలి మనం..? ఇలాంటి అసోసియేషన్ లో ఎందుకు ఉండాలనంటూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు.