తిరువీర్ (Thiruveer) అందరికీ సుపరిచితమే. ‘ఘాజీ’ (Ghazi) ‘ఏ మంత్రం వేసావే’ (Ye Mantram Vesave) ‘శుభలేఖ +లు ‘ ‘మల్లేశం’ (Mallesham) ‘జార్జ్ రెడ్డి’ (George Reddy) ‘పలాస 1978’ ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) వంటి సినిమాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించిన ఇతను.. ‘మసూద’ (Masooda) అనే హారర్ సినిమాతో హీరోగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజంగానే థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో చాలా ఈజ్ తో నటిస్తూ ఉంటాడు తిరువీర్ (Thiruveer). ఇతని అసలు పేరు తిరుపతి రెడ్డి అయినప్పటికీ..సినిమాల్లోకి వచ్చాక తిరువీర్ గా పేరు మార్చుకున్నాడు.
‘మసూద’ తర్వాత ఇతను ‘పరేషాన్’ (Pareshan) అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు. దాన్ని రానా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నా.. నటుడిగా తిరువీర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా.. తిరువీర్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలీదు. నటుడిగా ఎదుగుతున్న రోజుల్లోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అందుకే తన సోషల్ మీడియా ఖాతాల్లో ‘అతను యుద్ధం గెలిచి వచ్చాడు..
కానీ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు’ అంటూ తన తల్లిదండ్రులను తలుచుకొని ఎమోషనల్ కోట్స్ రాస్తుంటాడు. ఇదిలా ఉండగా.. తన సొంత ఊర్లో సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది తిరువీర్ తల్లి కోరిక. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘2 దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక’ అంటూ గృహప్రవేశం ఫోటోలు షేర్ చేశాడు తిరువీర్. తన సతీమణి కల్పనా రావ్ తో కలిసి కొత్తింట్లోకి అడుగుపెడుతున్న టైంలో తిరువీర్ తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.