ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన వేణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దమ్ము, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీతో వేణుకు సినిమా ఆఫర్లు పెరుగుతాయని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
జగపతిబాబు, వేణు కాంబినేషన్ లో హనుమాన్ జంక్షన్, ఖుషీఖుషీగా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. వేణు మాట్లాడుతూ నేను తమిళనాడులో పెరిగానని పుట్టింది కాకినాడ అని అన్నారు. నాకు తమిళం బాగా వచ్చు అని ఆయన పేర్కొన్నారు. మా నాన్న అక్కడ చూపించిన ఒకే ఒక్క సినిమా శంకరాభరణం అని వేణు చెప్పుకొచ్చారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారని సినిమా గొప్పదని వేణు అన్నారు.
శంకరాభరణం సినిమాను కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేయడం గర్వంగా ఫీలవుతానని ఆయన తెలిపారు. నా ప్రపంచం సినిమా సినిమా సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరోజు సినిమాకు వెళ్లి దొరికిపోయానని వేణు తెలిపారు. నాన్న ఆ సమయంలో బెల్ట్ తెగేలా కొట్టారని వేణు చెప్పుకొచ్చారు. సినిమా తప్ప ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవని ఆయన పేర్కొన్నారు.రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ లేదని ఆయన తెలిపారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వేణు తెలిపారు.
జగపతిబాబు వల్ల నేను ఫైనాన్షియల్ గా లాస్ అయ్యానని వేణు పేర్కొన్నారు. జగపతిబాబు తన హామీతో నా నుంచి డబ్బులు ఇప్పించారని ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వలేదని వేణు అన్నారు. 14 లక్షల రూపాయలు నేను పోగొట్టుకున్నానని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో నేను జగపతిబాబును ఎక్కడా కలవలేదని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని వేణు అన్నారు.