నిఖిల్ హీరోగా పరశురామ్ పెట్ల(బుజ్జి) దర్శకత్వంలో వచ్చిన ‘యువత’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది హీరోయిన్ అక్ష. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నానికి జోడీగా ‘రైడ్’ అనే సినిమాలో కూడా నటించింది. అటు తర్వాత రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కందిరీగ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. కానీ ఎందుకో ఈమెకు తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్సులు లభించలేదు.
రవితేజ ‘బెంగాల్ టైగర్’ , బాలకృష్ణ ‘డిక్టేటర్’ వంటి సినిమాల్లో నటించినా.. అందులో ఆమె చేసింది గెస్ట్ రోల్స్ మాత్రమే కావడం గమనార్హం. ఇక 2017 లో శర్వానంద్ హీరోగా నటించిన ‘రాధ’ సినిమాలో చిన్న అతిథి పాత్ర పోషించిన తర్వాత ఈమె మాయమైపోయింది. హిందీలో పలు వెబ్ సిరీస్లలో నటిస్తుంది. తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. (Aksha) ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :