‘ఆహా’లో త్వరలో స్ట్రీమింగ్ రానున్న ఓ డ్యాన్స్ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది చూశారా? చూడకపోతే ఓసారి చూడండి. అందులో ఓ అన్ యూజువల్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ ప్రోమో చూసి ఉంటే అది ‘బాయ్ ఫ్రెండ్’ డైలాగే కదా అని ఠక్కున చెప్పేస్తారు. ఆ షోకి జడ్జిగా వచ్చిన ఫారియా అబ్దుల్లా (Faria Abdullah) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందులోనే బాయ్‌ఫ్రెండ్ టాపిక్ చర్చకు వచ్చింది.
Faria Abdullah
హీరోయిన్లు – రిలేషన్ షిప్‌లు.. టాలీవుడ్‌కే కాదు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అమ్మాయి ఆర్ అబ్బాయి ఎవరైనా రిలేషన్ షిప్‌లోకి ఎప్పుడో ఓసారి రావాల్సిందే. అయితే హీరోయిన్ల రిలేషన్ షిప్‌ల గురించి కాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుంది వాళ్ల ఫ్యాన్స్‌కి. అందుకే హీరోయిన్లు ఏదైనా ఈవెంట్ కోసమో, ఇంకెందుకోసమో బయటకు వచ్చినప్పుడు హోస్ట్‌లు, యాంకర్‌లు అడుగుతుంటారు. వాటికి హీరోయిన్లు ‘అబ్బే ఎవరూ లేరు’ అని అంటుంటారు.
నిజం జీవితంలో వాళ్లకు నిజంగానే లవర్ ఉన్నా ఆ విషయం చెప్పరు. కానీ ఫారియా అబ్దుల్లా మాత్రం లవర్ ఉన్నాడు అనే చెప్పింది. హోస్ట్ ఓంకార్ ‘నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?’ అని అడిగితే.. ఠక్కున ఆమె ‘అవును ఉన్నాడు. నాలాగే దాదాపు ఆరు అడుగులు ఉంటాడు’ అని ఫారియా చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. అయితే అంతలోనే నవ్వుతూ అదంతా ఉత్తిదే అనేసింది.
ఏ హీరోయిన్‌ని ఈ విషయం అడిగినా ఒకటే మాట చెబుతారు. బాయ్ ఫ్రెండ్ లేడు, రిలేషన్ షిప్‌లో లేను అని చెబుతుంటారు. నాకెందుకో కొత్తగా ట్రై చేయాలనిపించి అలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాను అని ఫారియా క్లారిటీ ఇచ్చింది. ఓ ఆర్టిస్టుతో ఫారియా రిలేషన్‌లో ఉన్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఆమె బాయ్ ఫ్రెండ్ గతంలో ఆమెతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించినట్టు సమాచారం. మరి ఫారియా అలా ఎందుకందో ఆమెనే చెప్పాలి.