ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణకు జయప్రద కోర్టుకు హాజరు కాలేదట. అందుకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యు చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ విషయం పై న్యాయవాది అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘కోర్టు విచారణకు మాజీ ఎంపీ, సీనియర్ హీరోయిన్ అయిన జయప్రద హాజరు కాకపోవడం వల్ల..
జయప్రద తీరుపై న్యాయస్థానం మండిపడింది. అందుకే ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. డిసెంబర్ 27న అంటే మంగళవారం నాడు జరిగే విచారణకు జయప్రదను హాజరుపరచాల్సిందిగా .. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కోర్టు ఆదేశించడం జరిగింది’’ అంటూ ఆయన తెలిపారు. 2019లో జయప్రద పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 18, 2019 న, రాంపూర్‌లోని కామ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని
పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభకు సంబంధించినది ఒక కేసు కాగా 2019, ఏప్రిల్ 19న.. ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ పెట్టిన కేసు మరొకటి కావడం గమనార్హం. ఈ కేసుల విచారణకు ఆమె ఎందుకు హాజరు కావడం లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోపక్క జయప్రద ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్లో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.