Actress Meena: ఛాన్స్ ఇస్తే టాలెంట్ చూపిస్తానన్న మీనా!

ఈ ఏడాది విడుదలైన దృశ్యం 2 సినిమా మలయాళ, తెలుగు వెర్షన్స్ లో నటించి ప్రముఖ నటి మీనా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మీనా తాజాగా ఒక సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాటలంటే నాకు చాలా ఇష్టమని అప్పుడప్పుడు సరదాగా పాడుతుంటానని మీనా పేర్కొన్నారు. తాను డ్యాన్స్ నేర్చుకున్నానని సింగింగ్ మాత్రం నేర్చుకోలేదని ఆమె అన్నారు.

తాను ప్రొఫెషనల్ సింగర్ ను కాదని అయితే పాట పాడాలనే ఆసక్తి మాత్రం ఉందని మీనా వెల్లడించారు. ఒక పాట పాడాలని తనకు అప్పుడప్పుడు అనిపిస్తుందని మీనా పేర్కొన్నారు. కీరవాణి, థమన్ తనకు అవకాశం ఇస్తారేమో చూడాలని మీనా తెలిపారు. తనకు రొటీన్ పాత్రలను ఆఫర్ చేయొద్దని కొత్త క్యారెక్టర్స్ చేసే టాలెంట్ తనలో ఉందని ఆ టాలెంట్ ను గుర్తించాలని ఆమె కామెంట్లు చేశారు. సీనియర్ హీరోయిన్ అంటే అమ్మ, వదిన, అక్క పాత్రలిస్తున్నారని మీనా అన్నారు.

అమ్మ, అక్క, వదిన తరహా పాత్రలలో నటించాలని తనకు లేదని మీనా చెప్పుకొచ్చారు. తాను ఆ పాత్రల కంటే బెటర్ రోల్స్ లో నటించగలనని మీనా చెప్పుకొచ్చారు. రచయితలు తనకోసం కొత్త పాత్రలు రాస్తారని ఆశిస్తున్నానని మీనా పేర్కొన్నారు. కొత్తగా, ఆసక్తికరంగా ఉండే పాత్రలు చేయాలని ఉందని మీనా తెలిపారు. టెక్నాలజీ వల్ల మరింత బాగా నటించే ఛాన్స్ దక్కిందని మీనా చెప్పుకొచ్చారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.