పాయల్ రాజ్‌పుత్ కొవిడ్19 టెస్ట్ చెయ్యించుకున్నారు. శ్వాబ్ టెస్ట్ కోసం ముక్కులో బడ్ పెట్టగా మరీ చిన్నపిల్లలా ఏడ్చారు. గట్టిగా అరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఓవర్ యాక్షన్ చేస్తుందని పాయల్ మీద కామెంట్లు చేశారు. ఏమీ లేకుండా ఏదో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తుందని ట్రోల్ చేశారు. భయపడినందుకు తనను ట్రోల్ చేసిన వాళ్ళకు పాయల్ కౌంటర్ ఇచ్చారు.
“నాకు ఇంజెక్షన్లు, సూదులు, మెడిసిన్ కి సంబంధిచినవి అంటే నాకు భయం. అందువల్ల, కొవిడ్19 శ్వాబ్ టెస్ట్ చెయ్యించుకోవడం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. అందుకు ట్రోల్ చెయ్యడం అన్యాయం” అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చారు. రామోజీ ఫిలింసిటీ శుక్రవారం పాయల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా యూనిట్ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ టెస్ట్‌లు చెయ్యించారు. ముగ్గురు డాక్టర్లను సెట్ కి పిలిపించారు. మొదట టెస్ట్ చెయ్యించుకోకుండా తప్పించుకోవాలి పాయల్ ప్రయత్నించారు.
తరవాత అందరి సేఫ్టీ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని చెయ్యించుకున్నారు. సుమారు 70 నుడి 80 రోజులు పాటు నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ చెయ్యనున్నారు. పాయల్ తో పాటు ఆమెకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా హైదరాబాద్ వచ్చారు. పాయల్ కూడా కరోనా సమయంలో ముంబై ఉంది హైదరాబాద్ ట్రావెల్ చెయ్యడం సేఫ్ కాదని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ప్రజెంట్ ఫ్రైడ్ ఇంట్లో వుంటున్నారు. ఓ ఇల్లు చూసుకుని త్వరలో షిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు.