నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకపరిచయం అవసరం. సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ల ఫాలోయింగ్ కు తీసిపోదు. తన కూతురు సుప్రీత కలిసి ఈమె చేసే డ్యాన్స్ లు ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.అంతేకాకుండా ఏజ్ తో సంబంధం లేకుండా గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది.ఈమె వయసు 44 ఏళ్ళు అయినప్పటికీ అలా అస్సలు కనిపించదు. 2019 సురేఖ వాణికి ఓ బ్లాక్ ఇయర్ అని చెప్పొచ్చు.
ఆ ఏడాది ఆమె భర్తని పోగొట్టుకుని డిప్రెషన్ కు వెళ్ళిపోయింది. దాంతో చాలా వరకు సినిమా అవకాశాలు ఈమె మొహం చాటేశాయి. కూతురు కోసం కోలుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ కావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సురేఖ వాణి దుబాయ్ లో ఉంది. కొద్ది రోజులుగా అక్కడే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తుంది. అయితే సుప్రీత ఈమెతో లేదు.బహుశా సినిమా షూటింగ్లో భాగంగా వెళ్లినట్టు ఉంది. అయితే ఆమె ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద చర్చకి దారి తీసింది.
ఆమె స్టే చేస్తున్న హోటల్ గదిలో ఉన్న కిటికీ వద్ద ఓ మందు బాటిల్, పక్కనే గ్లాస్ ఉన్న ఫోటోని షేర్ చేసి… ‘ఇంత కంటే మంచి ఆనందం, అనుభూతి ఎక్కడ ఉంటుంది?!’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.