యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ ప్లే చేసిన ‘అదుర్స్’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.ముఖ్యంగా ఈ చిత్రంలో చారి పాత్రలో ఎన్టీఆర్… బ్రహ్మానందంని కూడా డామినేట్ చేస్తూ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు.ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్… ఎన్టీఆర్ లో కామెడీ యాంగిల్ ను కూడా బయటకి తీసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు.
వల్లభనేని వంశీ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ సరసన నయనతార,షీలా వంటి భామలు హీరోయిన్లుగా నటించారు. 2010 వ సంవత్సరం జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలై 12ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.90 cr
సీడెడ్
6.10 cr
ఉత్తరాంధ్ర
2.55 cr
ఈస్ట్
1.65 cr
వెస్ట్
1.37 cr
గుంటూరు
1.45 cr
కృష్ణా
1.58 cr
నెల్లూరు
1.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
23.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.87 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
26.54 cr
‘అదుర్స్’ చిత్రానికి రూ.23.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.26.54 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకి రూ.2.74 కోట్ల వరకు లాభాలు దక్కాయన్న మాట. ఆ సంక్రాంతికి పోటీగా వెంకటేష్ ‘నమో వెంకటేశ’, రవితేజ ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ‘అదుర్స్’ చిత్రానికే ప్రేక్షకులు ఓటేశారు. ఆ 2010 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ‘అదుర్స్’ చిత్రం.