పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.
హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.కానీ సోమవారం నుండీ కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
34.27 cr
సీడెడ్
9.03 cr
ఉత్తరాంధ్ర
9.62 cr
ఈస్ట్
5.65 cr
వెస్ట్
4.00 cr
గుంటూరు
6.37 cr
కృష్ణా
4.83 cr
నెల్లూరు
2.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
75.86 cr
హిందీ
64.58 cr
తమిళ్
2.25 cr
కర్ణాటక
11.66 cr
కేరళ
0.80 cr
ఓవర్సీస్
23.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్ )
178.45 cr
‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.
మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.178.45 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.51.55 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది కూడా చిన్న టార్గెట్ అయితే కాదు. రెండో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.