అవును.. హెడ్డింగ్లో ఉన్నది నిజమే. డిజాస్టర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న రోజునే కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఏంటా సినిమా? అందులో హీరో ఎవరు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. విషయంలోకి వెళితే.. రెండేళ్ల క్రితం అఖిల్ (Akhil Akkineni) హీరోగా ‘ఏజెంట్’ (Agent) అనే సినిమా వచ్చింది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
తర్వాత నిర్మాత కేసులో ఇరుక్కోవడం వల్ల.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి నోచుకోలేదు.మొత్తానికి ఇప్పుడు అడ్డంకులు అన్నీ తొలగించుకుని ‘సోనీ లివ్’ లో మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. సరిగ్గా అదే రోజు నుండి.. అంటే మార్చి 14 నుండి అఖిల్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఏజెంట్’ తర్వాత అతను కూడా మరో సినిమాలో నటించలేదు. మొత్తానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరుతో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్.
దీనిని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నాగార్జునే నిర్మించనున్నారు అని తెలుస్తుంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో రూపొందే మూవీ ఇది.చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. నందు మొదటి సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమానే..! అది పర్వాలేదు అనిపించేలా ఆడింది. ఇప్పుడు రెండో సినిమా షూటింగ్ ను కూడా సెంటిమెంట్ గా అక్కడి నుండే మొదలు పెట్టబోతున్నారు అని స్పష్టమవుతుంది.