స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రతి నిర్ణయానికీ ఓ కారణం ఉంటుంది. అల్లు అర్జున్ Allu Arjun) తన కెరీర్‌లో ఎప్పుడూ స్ట్రాటజితో ముందుకు సాగుతున్నాడు. పుష్ప 2 (Pushapa 2) తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ కాగా, అదే సమయంలో అట్లీ (Atlee Kumar) డైరెక్షన్‌లో మరో మూవీ కూడా చర్చల్లోకి వచ్చింది. కానీ వీటిలో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనేదే ప్రస్తుతం హాట్ టాపిక్.
తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి కథను పూర్తిగా విన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతుందని, పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో దీని కోసం సరైన ప్రీ ప్రొడక్షన్ అవసరం అని బన్నీ భావిస్తున్నాడట. అందుకే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను మరికొన్ని నెలలు వెనక్కి నెట్టి, ముందుగా మరో సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఈ ఆలస్యం వల్ల కథకు మరింత న్యాయం చేయొచ్చని భావిస్తున్నట్లు టాక్.
ఎందుకంటే ఇది ఆయన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, మేకింగ్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటేనే ప్రాజెక్ట్ కచ్చితంగా స్థాయిని పెంచుతుందని భావిస్తున్నారు. పైగా ఇది ఓ విజువల్ స్పెషలైజ్డ్ మూవీ అవుతుండటంతో, రష్‌గా సెట్స్ పైకి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలస్యం వల్ల త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు మరింత మెరుగుదల వచ్చే అవకాశముంది. అలాగే అల్లు అర్జున్ తన క్రేజ్‌ను ముందుగా మరో సినిమాతో క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యంగా అనిపించినా, దీని వెనుక లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. అగ్రహీరోలు రెండు సినిమాలను సమాంతరంగా ప్లాన్ చేయడం చాలా అరుదు. అయితే బన్నీ ఈ తతంగాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2026లో విడుదల చేయాలనే టైమ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ తన ప్రాజెక్ట్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు, బన్నీ మాస్, కమర్షియల్ సినిమాల నుంచి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ కథలోకి ఎంటర్ అవుతుండటంతో, ఇది అతనికి కొత్త ఛాలెంజ్ కానుంది. మొత్తానికి, ఈ ఆలస్యం ప్రాజెక్ట్‌కి మంచి ఫలితాలు తీసుకురావొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.