అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ హిట్ ‘అల వైకుంఠపురములో’ రికార్డుల మోత ఇప్పట్లో ఆగేలా లేదు. సంక్రాంతి సెలవులు కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.. ఆ తరువాత ఈ సినిమాకి అంత సీన్ ఉండడు అనుకున్న వాళ్ళకి ఈ చిత్రం ఘాటుగా సమాధానం చెప్తుంది. ఇప్పటికీ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతూనే ఉంది.
ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
34.92 cr
సీడెడ్
16.03 cr
ఉత్తరాంధ్ర
16.60 cr
ఈస్ట్
9.56 cr
వెస్ట్
7.61 cr
కృష్ణా
9.32 cr
గుంటూరు
9.60 cr
నెల్లూరు
3.82 cr
ఏపీ+తెలంగాణ
107.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
10.65 కోట్లు (కరెక్టడ్
ఓవర్సీస్
16.48 cr
వరల్డ్ వైడ్ టోటల్
134.59 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…107.46 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..134.59 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 214.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ లను అధిగమించింది. ఫుల్ రన్ లో ‘బాహుబలి 1’ కలెక్షన్ లను కూడా అదిగమించినా ఆశ్చర్యం లేదనిపించేలా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రం ఇప్పటి వరకూ 50 కోట్ల వరకూ లాభాలను అందుకుని మరో రికార్డు సృష్టించింది. ఫుల్ రన్లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.