అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ ‘బాహుబలి’ రికార్డును దాటేయడానికి రెడీ అయ్యాడు. అవును.. అయితే వరల్డ్ వైడ్ గా కాదు లెండి… తెలుగురాష్ట్రాల్లో మాత్రమే..! అవును తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ 114 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఈ రికార్డును క్రాస్ చేయలేకపోయింది. కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఈ రేర్ ఫీట్ ను సాధించడానికి రెడీ అవుతుంది.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 14 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
37.27 cr
సీడెడ్
16.76 cr
ఉత్తరాంధ్ర
17.73 cr
ఈస్ట్
10.13 cr
వెస్ట్
8.03 cr
కృష్ణా
9.70 cr
గుంటూరు
10.09 cr
నెల్లూరు
4.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
11.22 cr
ఓవర్సీస్
17.44 cr
వరల్డ్ వైడ్ టోటల్
142.43 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 14 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…113.77 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..142.43 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 227 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరి కొద్ది గంటల్లో ‘బాహుబలి 1(114 కోట్లు తెలుగురాష్ట్రాల్లో)’ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేసెయ్యడం గ్యారంటీగా కనిపిస్తుంది. పవన్, ప్రభాస్, మహేష్, చరణ్, ఎన్టీఆర్ వంటి విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలు ఈ ఫీట్ ను సాధిస్తారు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా వారి తరువాతి స్థానంలో ఉన్న అల్లు అర్జున్… ఈ ఫీట్ ను సాధించబోతుండడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.