‘పుష్ప 2’తో (Pushpa 2) పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun), ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో (Atlee Kumar) కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, భారీ బడ్జెట్‌తో హై వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ 2026 జనవరిలో విడుదల కానుంది. అట్లీ ‘జవాన్’ (Jawan) సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి అల్లు అర్జున్‌తో కలిసి మరో భారీ విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది, త్వరలో షూటింగ్ మొదలు కానుంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సమక్షంలో శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌తో భారతీయ సెన్సిబిలిటీస్‌ను మిళితం చేస్తూ కొత్త అనుభూతిని అందించనుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, అట్లీ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను ఎంచుకోవడం వల్ల హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నటుడు ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది.
హీరోయిన్‌గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , కియారా అద్వానీ (Kiara Advani) పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. సెట్స్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ డబుల్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా, అట్లీ దర్శకత్వ ప్రతిభతో పాటు బన్నీ స్టార్‌డమ్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. 2026 సమ్మర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం అభిమానులకు మరో విజువల్ ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నారు.