భోజ్‌పురిలో ‘డీజే’ రికార్డు

అల్లు అర్జున్‌ మన దగ్గర స్టైలిష్‌ స్టార్‌… మలయాళంలోకి మల్లు అర్జున్‌… అదే భోజ్‌పురిలోకి వెళ్తే భోజ్‌పురి బన్నీ. ఇది ఇంకా జరగలేదు కానీ… ఆయన సినిమాల జోరు ఇలానే కొనసాగితే కచ్చితంగా ఇదే జరుగుతుందంటున్నారు సినీ పరిశీలకులు. కారణం బన్నీ ‘దువ్వాడ జగన్నాథం’ భోజ్‌పురిలో సాధించిన రికార్డులు. ఈ సినిమా భోజ్‌పురి డబ్బింగ్‌ వెర్షన్‌ను ఇటీవల అక్కడ టీవీల్లో టెలీకాస్ట్‌ చేశారు. అప్పుడే రికార్డులు సాధించింది. టీవీల్లో భోజ్‌పురి ‘డీజే’ వేసినప్పుడు ఏకంగా 39.83 లక్షల ఇంప్రెషన్లు వచ్చాయట.

ఇప్పటివరకు భోజ్‌పురి టీవీ చరిత్రలో ఇన్ని ఇంప్రెషన్స్‌ వచ్చిన తొలి సినిమా అట ఇది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమా తెలుగులో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే వసూళ్ల పరంగా చూస్తే… మంచి విజయమే అందుకుంది. ఇప్పుడు భోజ్‌పురిలోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇప్పుడు చెప్పండి మేం ముందుగా అన్నట్లు అల్లు అర్జున్.. భోజ్‌పురి బన్నీ అయ్యేలా ఉన్నాడు కదా.

Allu Arjun's Duvvada Jagannadham 3YearsForDJSensation1

బన్నీ నటించి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా డబ్బింగ్‌ చేసి అక్కడ రిలీజ్‌/ టెలీకాస్ట్‌ చేస్తే.. వాటినీ ఆదరిస్తారు. సో అలా మాలీవుడ్‌లోనే కాకుండా, భోజ్‌పురిలోనూ అల్లు అర్జున్‌ రాణించొచ్చు ఏమంటారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ హిందీ వెర్షన్‌ దూసుకుపోతోంది. 32 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.