అసలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో అర్ధం కావడమే లేదు…హీరోలు…అందరూ బాగానే ఉంటున్నారు, కానీ వారి అభిమానులు మాత్రం శ్రుతిమించి పోతున్నారు. ఒక పక్క నందమూరి వంశంలో బాబాయ్-అబ్బాయ్ మధ్య వార్ అభిమానుల మధ్య వైరాన్ని కలిగిస్తే, మరో పక్క మెగా శిబిరంలో పవన్ అభిమానులు రచ్చ..రచ్చ చేస్తున్నారు..ఇంతకీ విషయం ఏమిటంటే…భారీ అంచనాలతో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్న సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పవర్ స్టార్ అభిమానులు….దానితో వారి కాస్త హద్దులు మీరీ ప్రవర్తిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి..
మొన్న జరిగిన బన్నీ ‘సరైనోడు’ ఆడియో వేడుకలో జరిగిన సంఘటన పట్ల ఫిలింనగర్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి….స్టేజ్ పై అల్లుఅర్జున్ ప్రవర్తన, ఉపన్యాసంలో చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చి, ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తన స్పీచ్ లో తీసుకురాకుండా స్పీచ్ ముగించడం…. పవన్ అభిమానులకు విపరీతమైన షాక్ ఇచ్చింది అని కొందరు అంటుంటే….కాదు కాదు, పవన్ అభిమానులే బన్నీ మాట్లాడేటప్పుడు అడ్డుపడుతూ…పవన్ కల్యాణ్ స్లోగన్స్ ఇచ్చారు అని కొందరు చెబుతున్నారు….
ఇదంతా ఒక ఎత్తు అయితే టాలీవుడ్ విశ్లేషకుల వాదన ప్రకారం…నిన్న బన్నీ ‘సరైనోడు’ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పిన విషయం బట్టి… ‘సరైనోడు’ సక్సస్ తో బన్నీ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది అని అది అతని కరియర్ కు మంచిది కాదు అని చెబుతున్నారు.. ఏది ఏమైనా…పవన్ ఫ్యాన్స్ కోపం బన్నీ సినిమాలపై ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందో చూద్దాం.