తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప ది రూల్’. ‘పుష్ప’ పార్ట్ 1కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాటలు, బన్నీ మేనరిజమ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై హైప్ వచ్చింది. దానికి తగ్గట్లుగా సినిమా ఉండాలని.. స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేశారు దర్శకుడు సుకుమార్.
రీసెంట్ గానే వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను మొదలుపెట్టి.. పూర్తి చేశారు కూడా. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ గ్యాప్ లేకుండా మూడు వారాల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బన్నీ జపనీస్ భాష మాట్లాడనున్నారట.
ఎర్రచందనం స్మగ్లింగ్ లో అతడు ఇంటర్నేషనల్ రేంజ్ లో ఎదుగుతాడట. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ను డీల్ చేయడానికి జపాన్ వెళ్లడం, అక్కడకి వెళ్లే ముందు కాస్త జపనీస్ నేర్చుకొని.. అక్కడి వాళ్లతో అదే భాషలో మాట్లాడడం చేశారట. ఈ సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయని.. జపాన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ రష్మిక పాల్గొనలేదు.
కొత్త షెడ్యూల్ లో ఆమెతో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్నారు. ‘పుష్ప2’లో ప్రధాన విలన్ గా ఫాహద్ ఫాజిల్ కనిపించనుండగా.. జగపతి బాబు కూడా కొత్త విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇక పార్ట్ 1లో ఉన్న ముఖ్యమైన పాత్రలు సునీల్, రావు రమేష్, అనసూయ, ధనుంజయ్ పార్ట్2లో కూడా కనిపించనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లేదా.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.