Allu Ayaan: అల్లు అయాన్.. ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ కాదట!
- November 2, 2024 / 05:01 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తనయుడు అల్లు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికే అతని వీడియోలు ఫొటోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ తరచూ తన పిల్లలతో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ, వారిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమాటిక్ ఈవెంట్స్ కు అల్లు అయాన్ ను తీసుకురావడం చాలా అరుదుగా జరిగింది. ఇటీవల అయాన్ (Allu Ayaan) అల్లు అర్జున్ తో కలిసి బాలయ్య (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షో లో పాల్గొన్నాడట.
Allu Ayaan

ఈ సీజన్ లో బాలయ్య, అల్లు అర్జున్ తో చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా, అయాన్ ను బాలయ్య ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారట. “నీ ఫేవరేట్ హీరో ఎవరు?” అని అడగ్గా, అందరూ అల్లు అర్జున్ అని చెప్పొచ్చని భావించినా, అయాన్ స్పందన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తన ఫేవరెట్ హీరో ప్రభాస్ (Prabhas) అని చెప్పడంతో, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయాన్ తన తండ్రి కంటే ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకిరా నందన్ కూడా ప్రభాస్‌ను ఫేవరెట్ హీరోగా చెప్పినట్లు గుర్తు చేసుకుంటూ, “స్టార్ కిడ్స్ లో ప్రభాస్ పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని” అంటున్నారు. ఈ షోలో అల్లు అర్జున్ కూడా బాలయ్యతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరిగే వార్ గురించి, అలాగే ఎన్నికల సమయంలో తన ప్రచారంపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. షో ఎపిసోడ్ టెలికాస్ట్ కి ముందుగానే ప్రోమో విడుదల చేయబోతున్నారు. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















