అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా తెరకెక్కిన బడ్డీ (Buddy) సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లతో రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్నాయి. అయితే బడ్డీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బడ్డీ సినిమాకు పలు నగరాల్లో స్పెషల్ ప్రీమియర్స్ వేశామని ఆ ప్రీమియర్స్ లో నేను కూడా పాల్గొని ప్రేక్షకులతో కలిసి సినిమా చూశానని అల్లు శిరీష్ వెల్లడించారు.
ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేశారని వాళ్ల రియాక్షన్ చూసి మేము కూడా ఆనందించామని అల్లు శిరీష్ తెలిపారు. 100 శాతం పిల్లలతో కలిసి మా సినిమా చూడొచ్చని ఆయన అన్నారు. కెరీర్ కు సంబంధించి చాలా ప్రణాళికలు ఉన్నాయని శిరీష్ వెల్లడించారు. టెడ్డీ ఐడియాను మాత్రమే తీసుకొని కథనం మార్చి ఈ సినిమా తీశామని ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లేవని ఈ సినిమా దర్శకుడు శామ్ ఆంటోన్ (Sam Anton) పేర్కొన్నారు.
ఈ సినిమా ఓటీటీలో 50 రోజుల తర్వాత రిలీజవుతుందని అల్లు శిరీష్ అన్నారు. బడ్డీ సినిమాలో టెడ్డీ చుట్టే కథ ఉంటుందని నా నెక్స్ట్ మూవీలో మాత్రం మంచి డ్యాన్స్ ఉంటుందని అల్లు శిరీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మా అన్నయ్య అర్జున్ (Allu Arjun) నాకు ఇష్టమైన బడ్డీ అని శిరీష్ వెల్లడించారు. బాల్యం నుంచి అన్ని విషయాలు అన్నయ్యతో పంచుకోవడం అలవాటు అని శిరీష్ పేర్కొన్నారు. ఏ విషయమైనా ముందు అన్నయ్యకే చెబుతానని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.
పవన్ (Pawan Kalyan) నుంచి మానసిక స్థైర్యం నేర్చుకుంటానని ఆయన అన్నారు. నాకు తెలిసి పవన్ కు ఉన్న స్థాయిలో మానసిక ధైర్యం మరెవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. చిరంజీవికి (Chiranjeevi) పాజిటివిటీ ఎక్కువని అందరితో మర్యాదపూర్వకంగా ఉంటారని అల్లు శిరీష్ కామెంట్లు చేశారు.