Amaran Collections: ‘అమరన్’.. 11 రోజుల కలెక్షన్స్..లాభం ఎంత?
- November 11, 2024 / 03:21 PM ISTByFilmy Focus
శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi)..జంటగా నటించిన ‘అమరన్’ (Amaran) మూవీ రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా దీనిని బాగా ఓన్ చేసుకున్నారు. రెండో వీకెండ్ లో ఎక్కువ చోట్ల హౌస్ ఫుల్స్ పెట్టింది. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు ‘అమరన్’ ని రూపొందించాడు.
Amaran Collections:

ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 7.40 cr |
| సీడెడ్ | 2.28 cr |
| ఉత్తరాంధ్ర | 2.01 cr |
| ఈస్ట్+వెస్ట్ | 0.98 cr |
| కృష్ణా + గుంటూరు | 1.36 cr |
| నెల్లూరు | 0.41 cr |
| ఏపి+ తెలంగాణ(టోటల్) | 14.44 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 11 రోజుల్లో రూ.14.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.9.44 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది.












