సుశాంత్ మరణించి దాదాపు రెండు నెలలు అవుతుంది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఉరి వేసుకొని మరణించినట్లు ప్రాధమిక సమాచారం. ఐతే రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అసలు ఇది నిజంగా హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు రేగుతున్నాయి. ఓ ప్రక్క కేసులో అనేక అనుమానాలున్నట్లు తెలుస్తుంది. మరో వైపు ముంబై పోలీసులు ఎవరినో కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని గట్టి ప్రచారం సాగుతుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని చేర్చారు.
అలాగే ఆమె కుటుంబ సభ్యులతో పాటు సుశాంత్ మాజీ మేనేజర్స్ పై కూడా కేసు నమోదు కావడం జరిగింది. రియా చక్రవర్తిని మరియు ఆమె కుటుంబ సభ్యులను ఈడీ విచారిస్తుంది. కాగా సుశాంత్ శవాన్ని ఆసుపత్రికి చేర్చిన అంబులెన్సు సిబ్బందిలో ఒకరు చెవుతున్న విషయాలు షాక్ కి గురిచేసేవిగా ఉన్నాయి. అతను సుశాంత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సీలింగ్ కి వేలాడుతున్న సుశాంత్ శవం పసుపు వర్ణంలో ఉంది అన్నారు.
నిజానికి ఉరి వేసుకొని మరణించిన వారి శరీరం రంగు మారదు. అలాగే ఆయన నోటి నుండి నురుగు కూడా రాలేదని, శుశాంత్ కాళ్ళు సైతం ఉరి వేసుకున్న విధానంలో లేవు అన్నారు. ఈ తాజా వ్యాఖ్యలతో ఈ మరణం పై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబిఐ రంగంలోకి దిగిన నేపథ్యంలో సుశాంత్ మృతికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమైన వారిని పట్టుకుంటారేమో చూడాలి