Pawan Kalyan: పవన్ వల్ల లక్షా అరవై వేలు గెలిచిన జంట.. అసలేమైందంటే?
- September 16, 2024 / 12:14 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా పవన్ కళ్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. అయితే పవన్ కళ్యాణ్ వల్ల తాజాగా ఒక జంట కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఏకంగా 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. పవన్ పొలిటికల్ గా సాధించిన ఘనత వల్లే ఆ జంటకు 1,60,000 రూపాయలు దక్కాయి. ఒక జంట ఈ షోలో పాల్గొనగా సౌత్ లో డిప్యూటీ సీఎం అయిన స్టార్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.
Pawan Kalyan

సమాధానం తెలియని ఆ జంట ఆడియన్స్ పోల్ కోరగా 50 శాతం మంది పవన్ పేరును ఎంచుకోవడంతో వాళ్లు సైతం అదే సమాధానం చెప్పారు. అలా పవన్ పేరు వల్ల ఒక జంటకు ఏకంగా లక్షా 60 వేల రూపాయలు దక్కడం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల క్రితం ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత భారీ స్థాయిలో విరాళం ప్రకటించడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటుండగా పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో సత్తా చాటడంతో పాటు రాజకీయాల్లో సైతం ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భిన్నమైన జానర్లను ఎంచుకుంటూ ఉండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

















