వెండితెరపై స్టార్ హోదా వస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. వరుసగా రెండు మూడు విజయాలు దక్కితే లైఫ్ స్టైల్ లో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలని అంటారు. అలానే స్టార్ హోదా ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవలని కూడా ఉంటారు. కానీ శోభన్ బాబు మాత్రం అలా కాకుండా ఒక సూత్రం చెప్పారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మొదట్లో కోట్ల రూపాయాలు సంపాధించి చివరికి ధీన స్థితిలోకి వస్తుంటారు.
సరైన వైద్యం లేక ఉండడానికి ఇల్లు లేక అవస్థలు పడుతున్న సీనియర్ నటులు నటీమణులు ఫిల్మ్ నగర్ లో ఇంకా ఉన్నారు. అయితే అప్పట్లో శోభన్ బాబు మాత్రం ఎవరు కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపని ఫార్ములాను సరైన ఆచరణలో పెట్టి ఇప్పుడు భవిష్యత్తు తరానికి పది తారాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఇచ్చారు. వచ్చిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్ లోనే పెట్టారు. రెమ్యునరేషన్ చేతిలోకి రాగానే అందులో సగం డబ్బుతో ల్యాండ్స్ కొనేవారట. అప్పట్లో వేల రూపాయల్లోనే ల్యాండ్స్ దొరికేవి.
చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆయన ఒకేసారి 1000గజాలు, 500గజాలు కొనేసేవారు. అలా వందల ఎకరాల ల్యాండ్స్ ను కూడగట్టారు. ఇక ఇప్పుడు వాటి మొత్తం విలువ లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఒకనొక సమయంలో మురళి మోహన్ కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ లో బాగా నష్టపోయి ఉన్నప్పుడు శోభన్ బాబు సలహా మేరకు ఉన్న డబ్బుతోనే హైదరాబాద్ లోనే ల్యాండ్స్ కొనడం స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు ఆయనకు బలాన్ని ఇచ్చాయి. ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా శోభన్ బాబు ల్యాండ్స్ కొనమని చెప్పేవారట. భూమి రేటు భవిష్యత్తులో అమాంతంగా పేరుగుతుందని కుటుంబాలకు ఇచ్చే ఏకైక ఆస్తి అది ఒకటేనని సలహా ఇచ్చేవారట. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నవాళ్ళు ఇప్పుడు వందల కోట్లకి అధిపతులు అయ్యారు.