‘విజయలక్ష్మీ మూవీస్’ బ్యానర్ పై టి.త్రివిక్రమ్ రావు నిర్మాణంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘బద్రి’ చిత్రం విడుదల అయ్యి ఈరోజుతో 22 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఏప్రిల్ 20 2000 సంవత్సరంలో ఈ చిత్రం విడుదల అయ్యింది. మాస్ సినిమా అంటే సరికొత్త డెఫినిషన్ చెప్పింది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అని చెప్పాలి. అయితే ఈ చిత్రం వెనుక మనకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రంతోనే పవన్ – రేణూ దేశాయ్ కు మధ్య ప్రేమ చిగురించడం అది కాస్త ప్రేమ వరకూ వెళ్ళడం జరిగింది.
అంతే కాదు.. ఈ చిత్రంలో పూరి మొదట అనుకున్న హీరో పవన్ కాదు. అవును మీరు విన్నది నిజమే… ‘బద్రి’ స్క్రిప్ట్ ను మొదట పవన్ కోసం పూరి అనుకోలేదట. రాంగోపాల్ వర్మ దగ్గర 18 వ శిష్యుడు గా పూరి జగన్నాథ్ పనిచేసేవాడు పూరి జగన్నాథ్. ఆ టైములో రాంగోపాల్ వర్మ కి అత్యంత సన్నిహితుడు ఆయిన నాగార్జున తో పూరీకి కూడా మంచి స్నేహం ఏర్పడింది. దాంతో పూరి మొదట నాగార్జున ని దృష్టిలో పెట్టుకునే ‘బద్రి’ కథని రాసాడు.
కానీ ఆ టైములో నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. పూరి వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అందులోనూ అప్పటికే కరుణాకరన్, అరుణ్ ప్రసాద్ వంటి ఇద్దరు కొత్త డైరెక్టర్ లకు ఛాన్స్ లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని అతని వద్దకు ‘బద్రి’ కథను తీసుకెళ్ళాడు. తరువాత పవన్ చెప్పిన అనేక మార్పులు చేయగా… క్లయిమాక్స్ మాత్రం చేంజ్ చెయ్యను అని ముక్కు సూటిగా పూరి పవన్ కు చెప్పడం.పూరి ఆటిట్యూడ్ కూడా పవన్ కు నచ్చడంతో ఛాన్స్ ఇప్పించాడని తెలుస్తుంది. అలా ఆ కథ పూరి నాగార్జున కోసం రాసుకుంటే పవన్ వద్దకు వెళ్ళింది.