ఇప్పటి వరకూ మనం చూస్తూ వస్తున్న హీరోయిన్ ల ఇంట్రడక్షన్ లు ఎక్కువగా ఒకే ఫార్మాట్ లో ఉండవు. అయితే అప్పటి రోజుల్లో మాత్రం ఒకేలా ఉండేవి. ముఖ్యంగా హీరోయిన్ లతో .. హీరోల పరిచయాలు దాదాపు ఒకే సీన్ లలా ఉండేవి. ఓ సమస్య లో ఉన్న హీరోయిన్ ను హీరో ఎంట్రీ ఇచ్చి కాపాడటం.. వెంటనే ప్రేమ చిగురించడం… తరువాత ఆ ప్రేమని గెలిపించుకునే ప్రయత్నం చెయ్యడం.
అప్పటి వరకూ సినిమా అభిమానులకు కూడా ఈ సీన్ లు చూసి బోర్ కొట్టేసేది. అయితే దీనికి భిన్నంగా సరికొత్త ట్రెండ్ సృష్టించింది మాత్రం మన రాంగోపాల్ వర్మే. ‘శివ’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వర్మ.. ఆ తరువాత ఏ సినిమా చేస్తాడు అని అంతా అనుకున్నారు. కమర్షియల్ సినిమా కాకుండా ‘క్షణ క్షణం’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేసాడు. ఈ చిత్రం సత్య (శ్రీదేవి) తను ఉండే రూమ్ లో ఓ మర్డర్ జరగడం ఆ కేసులో ఉండటం జరుగుతుంది. ఆ హడావిడి లో ఓ హోటల్ కు వెళ్లి కూర్చుంటుంది.
అక్కడికి ఆమెను వెతుక్కుంటూ విలన్ గ్యాంగ్ వస్తారు.. మరో పక్క పోలీసులు కూడా వస్తారు. అక్కడికి రిలాక్స్ అవ్వడం కోసం వచ్చిన చందు(వెంకటేష్) నా కోసం పోలీసులు వచ్చారని భయపడి .. శ్రీదేవి గొంతు పై కత్తి పెట్టి ఎస్కేప్ అవుతాడు. విలన్ గ్యాంగ్ నుండీ తప్పించుకోవచ్చు అని సత్య అలోచించి అతనితో వెళ్ళిపోతుంది. చాలా వరకూ ఈ చిత్రం అడవిలోనే సాగుతుంది. అసలు ఈ హీరో, హీరోయిన్స్ ఈ రేంజ్ లో కలుసుకునే సీన్ ఇచ్చిన వర్మ క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేము అనడంలో అతిశయోక్తి లేదు.