పాన్ ఇండియా స్టార్ ను ప్రభాస్ కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడేలా చేసింది ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం. అనేక ప్లాప్ల తర్వాత ‘డార్లింగ్’ చిత్రంతో హిట్ అందుకున్న ప్రభాస్ కు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం హిట్టయ్యి ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచేలా చేసింది. దశరథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 22 2011 లో విడుదల అయ్యింది. అంటే ఈరోజుతో 9 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఈ చిత్రం వెనుక మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ‘సంతోషం’ చిత్రం తర్వాత సరైన హిట్టు లేని దర్శకుడు దశరథ్… సుమారు ఈ కథను రెండేళ్లు కష్టపడి డెవలప్ చేసాడట.
ముందుగా అనేక నిర్మాణ సంస్థలను సంప్రదించాడట. తరువాత దిల్ రాజు గారు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాదు ముందుగా ఈ చిత్రం కోసం మహేష్ ను అనుకున్నాడట దర్శకుడు దశరథ్. అతన్ని దృష్టిలో పెట్టుకునే ముందుగా ఈ కథను రాసుకున్నాడట.మొదట ఈ కథ దిల్ రాజు ద్వారా కూడా మహేష్ వినిపించాడట. అయితే ఎందుకో ఈ కథను మహేష్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తరువాత ప్రభాస్ కు కథ వినిపించడం… చాలా రోజుల తర్వాత ఓ కుటుంబకథా చిత్రం చెయ్యాలి అని ఎదురుచూస్తున్న ప్రభాస్ వెంటనే ఓకే చేసేసాడు.
అయితే షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఫైనల్ అవుట్ పుట్ చూసిన ప్రభాస్ కొన్ని చేంజెస్ చెప్పాడట. దీంతో మళ్ళీ కొన్ని సీన్ లు రీ షూట్ చేసారట. నిజానికి మొదట షూట్ చేసిన పార్ట్ లో కాజల్ … ఫారిన్ వెళ్ళే సీన్స్ లేవట. ప్రభాస్ సలహా మేరకు దిల్ రాజు మళ్ళీ వాటిని షూట్ చేయించారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అది కూడా ఫారిన్ వెళ్లకుండా గ్రాఫిక్స్ లో చేసారట. ఏదైతేనేం సినిమా సూపర్ హిట్ అయ్యింది.