బాలీవుడ్ లో తెరకెక్కిన ‘అంధాధూన్’ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా లాంటి యంగ్ హీరో ఈ సినిమాలో నటించాడు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మిగిలిన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అతడి సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లింది. కానీ ఈ రీమేక్ విషయంలో కోలీవుడ్ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దానికి కారణం సరైన నటులను ఎంపిక చేసుకోకపోవడం, అవుట్ డేటెడ్ డైరెక్టర్ చేతిలో సినిమాను పెట్టడమని తెలుస్తోంది. సీనియర్ హీరో ప్రశాంత్ ఈ సినిమాలో హీరో అట. హీరో సెలెక్షన్ తోనే జనాలకు సగం ఇంట్రెస్ట్ పోయింది.
ఇక టబు రోల్ కోసం సిమ్రాన్ ని తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు ముందుగా జేజే ఫ్రెడరిక్ అనే యంగ్ డైరెక్టర్ ని తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో.. ఏమో కానీ అతడిని తప్పించి.. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ను డైరెక్టర్ గా తీసుకున్నారు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన త్యాగరాజన్ ఆ తరువాత దర్శకుడిగా మారి తన కొడుకుని హీరోగా పెట్టి సినిమాలు తీశారు. కానీ ఏది వర్కవుట్ కాలేదు. అలాంటి వ్యక్తి ‘అంధాధూన్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ని ఎంతవరకు డీల్ చేయగలరో చూడాలి!