ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బ్యాడ్ టాక్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాకి వచ్చింది. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో సినిమాను విడుదల చేశారు. ఇక్కడ సినిమాకి నెగెటివ్ టాకే వచ్చింది. ఎనభైల నాటి కథతో సినిమా తీశాడంటూ దర్శకుడు శివని ఏకిపారేశారు. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు సాధిస్తోంది. ఏకంగా రూ.200 కోట్లు వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలిపి ఈ సినిమా రెండు వందల కోట్ల మార్క్ ను అధిగమిస్తోందని తెలుస్తోంది.
ఇందులో తొలిరోజు కలెక్షన్సే రూ.70 కోట్ల వరకు ఉన్నాయని లెక్కగడుతున్నారు. బాలీవుడ్ లో విడుదలైన ‘సూర్యవంశీ’ కన్నా.. రజినీకాంత్ సినిమానే కలెక్షన్స్ పరంగా దూకుడు చూపిస్తోంది. నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం విచిత్రమనే చెప్పాలి. రజినీకాంత్ సినిమాలను పొగుడుతూ రాసే.. తమిళ రివ్యూయర్లు కూడా ఈ సినిమాను దారుణంగా విమర్శించారు. పూర్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే కలెక్షన్స్ మాత్రం కోట్లలో వస్తున్నాయి. రజినీకాంత్ లాంటి హీరో వెండితెరపై కనిపిస్తే చాలు.. కథ-కథనాలతో సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు అభిమానులు.