అందరికీ సక్సెస్ ఒకే మార్గంలో దొరకదు అని సీనియర్ రైటర్, దర్శకుడు అయిన బి.వి.ఎస్.రవి వల్ల చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇతను దర్శకుడిగా 2 సినిమాలు తీశాడు. అవే ‘వాంటెడ్’ ‘జవాన్’..! రెండూ ప్లాపులే..! రైటర్ గా చేసిన సినిమాలు కూడా తనకు గుర్తింపు తీసుకురాలేదు. కానీ చాలా హిట్టు సినిమాలకు ఇతను రైటర్ గా పనిచేశాడు.కానీ వాటికి ఇతని పేరు వేయలేదు. మంచి సినిమాకి అంటే హిట్ సినిమాలకి స్క్రీన్ పై ఇతని పేరు పడలేదు.
కానీ స్క్రీన్ పై ఇతని పేరు పడిన సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. కానీ బీవీఎస్ రవికి వేరే విధంగా కలిసొస్తుంది. రెండేళ్లుగా చూసుకుంటే.. ఇతను రైటర్ గా ‘ఆహా’ కోసం చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రెండ్లు సీజన్లు సక్సెస్ అయ్యాయి. నటుడిగా చేసిన ‘క్రాక్’ ‘ధమాకా’ ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇందులో ‘క్రాక్’ మినహాయిస్తే మిగిలిన 3 సినిమాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసిన సినిమాలే కావడం విశేషం. ఇక తాజాగా బి.వి.ఎస్ రవి నటించిన మరో సినిమా ‘బెదురులంక 2012 ‘ కూడా సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అతను చేసింది రెండు నిమిషాల పాత్రే. సినిమా ప్రారంభంలో వచ్చి.. ఒకటి, రెండు డైలాగులు చెప్పి వెళ్ళిపోతాడు.
కథ ప్రారంభమయ్యేది ఇతని పాత్ర వల్లే.. ఎందుకంటే ఇతని వల్లే హీరో ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరెళతాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా కార్తికేయకి మంచి సక్సెస్ అందించింది. ఈ సక్సెస్ సెంటిమెంట్ వల్ల బీవీఎస్ రవికి (Director) నటుడిగా మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.