మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జునను మంచి స్నేహితుడిలా భావించే చిరంజీవి, నాగేశ్వర్రావుతో కలిసి “మెకానిక్ అల్లుడు” (Mechanic Alludu) అనే సినిమాలోనూ నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ అక్కినేని నాగేశ్వర్రావు (Akkineni Nageswara Rao) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ లో ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. అదే వేదిక మీద ఏయన్నార్ తో మంచి అనుబంధం కలిగిన సావిత్రమ్మ (Savitri) కుమార్తె చాముండేశ్వరి, ప్రసాద్ సంస్థ యజమాని రమేష్ ప్రసాద్ మరియు అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు.
Chiranjeevi
ఈ సందర్భంగా నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. నాన్నగారు నవ్వుతూ బ్రతకమని నేర్పించారని చెప్పిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. అదే సమయంలో నాగార్జున ఈ ఏడాది ఏయన్నార్ అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవికి బహుకరించనున్నట్లు ప్రకటించడం విశేషంగా నిలిచింది. అక్టోబర్ 28న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్న వేడుకలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతుల మీదుగా చిరంజీవికి ఏయన్నార్ అవార్డ్ ను అందించనున్నారు.
గతంలో ఏయన్నార్ అవార్డును దేవ్ ఆనంద్ (2006), షబానా అజ్మీ (Shabana Azmi) (2006), అంజలీదేవి (Anjali Devi) & జయసుధ (Jayasudha) (2007), వైజయంతిమాల (Vyjayanthimala) (2008), లతా మంగేష్కర్ (Lata Mangeshkar) (2009), కె.బాలచందర్ (K. Balachander) (2010), హేమమాలిని (Hema Malini) (2011), శ్యామ్ బెనగల్ (2012), అమితాబ్ బచ్చన్ (2014), గుడుపూడి శ్రీహరి (2016), రాజమౌళి (S. S. Rajamouli) (2017), శ్రీదేవి (Sridevi) (2018), రేఖ (Rekha) (2019) వంటి ప్రముఖులకు అందించారు. ఆ తర్వాత కరోనా కారణంగా గ్యాప్ తీసుకొని.. 2024 సంవత్సరానికి గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ ను అందజేయనున్నారు.