నేచురల్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ మంచి ఓపెనింగ్స్ ను సాధించడంలో విఫలమైంది.
గత వారం రిలీజ్ అయిన ‘మేజర్’ మొదటి రోజు కలెక్షన్స్ కంటే కూడా ‘అంటే సుందరానికీ’ ఓపెనింగ్స్ తక్కువగా నమోదయ్యాయి. శేష్ కంటే నాని మార్కెట్ ఎక్కువ. అయినా ఇంత తక్కువ నమోదవ్వడం ఏంటనేది అర్ధం కాని ప్రశ్న. ఒకసారి ‘అంటే సుందరానికీ!’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.54 cr
సీడెడ్
0.36 cr
ఉత్తరాంధ్ర
0.42 cr
ఈస్ట్
0.34 cr
వెస్ట్
0.34 cr
గుంటూరు
0.36 cr
కృష్ణా
0.26 cr
నెల్లూరు
0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.25 cr
ఓవర్సీస్
1.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.70 cr
‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.5.7 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.25.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ ను సాధించడంలో విఫలమైంది.
దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్లు తగ్గించకపోవడం ఒకటైతే మరో పక్క ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడం మరో కారణం అని చెప్పాలి.