‘శ్రీమంతుడు’ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ తో మర్చిపోలేని డిజాస్టర్ ను ఇచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో ‘స్పైడర్’ అనే మూవీ చేశాడు. ఇదే మూవీతో తమిళంలో కూడా డెబ్యూ ఇచ్చాడు మహేష్. అయితే 2017 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ‘స్పైడర్’ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
తమిళంలో కూడా ఈ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. అక్కడి క్రిటిక్స్ మహేష్ బాబు నటన పై ఘోరమైన విమర్శలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ‘బ్రహ్మోత్సవం’ రిజల్ట్ విషయంలో శ్రీకాంత్ అడ్డాలని విమర్శించారు కానీ మహేష్ జోలికి పెద్దగా ఎవ్వరూ రాలేదు. కానీ ‘స్పైడర్’ రిజల్ట్ విషయంలో మహేష్ ను నిందిస్తూ అభిమానులు సైతం పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
పైగా రూ.125 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ కేవలం రూ.62 కోట్ల షేర్ ను మాత్రమే సాధించి ఇక్కడ కూడా చేదు ఫలితాన్ని మిగిల్చింది. తాజాగా ‘1947’ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ కు వచ్చిన మురుగదాస్ కు ‘స్పైడర్’ రిజల్ట్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ..
‘ ‘స్పైడర్’ ఫెయిల్యూర్ నన్ను (Murugadoss) చాలా నిరాశకు గురి చేసింది. మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయానే అని బాధ పడ్డాను. కానీ మహేష్‌తో మళ్లీ కచ్చితంగా సినిమా చేస్తాను. హిట్ కొడతాను’ అంటూ మురుగదాస్ చెప్పుకొచ్చాడు.