ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఏఆర్ రెహమాన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. రాజమౌళి ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీర సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఏదైనా సాధించగలరని అనిపించిందని ఏఆర్ రెహమాన్ అన్నారు.
ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి మూవీ చూసి ఆశ్చర్యపోయానని ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తిని పెంచే విధంగా జక్కన్న సినిమాలు ఉంటాయని ఏఆర్ రెహమాన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పొన్నియిన్ సెల్వన్ అద్భుతమైన సక్సెస్ సాధించిందని ఏఆర్ రెహమాన్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. రోజా, బొంబాయి, దిల్ సే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అని ఆయన చెప్పుకొచ్చారు.
ఏఆర్ రెహమాన్ రాజమౌళి గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సినిమాసినిమాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగేలా రాజమౌళి అడుగులు వేస్తున్నారు. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ హీరోగా తెరకెక్కనుండగా నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి సైతం ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించేలా జక్కన్న అడుగులు వేస్తున్నారు. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా డేట్లు కేటాయించడానికి సిద్ధమేనని వెల్లడించారు. మహేష్ ఈ సినిమా కోసం 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.