హిందీ సినిమాల్లో పాటలు బాగుంటాయి… ఎవరైనా ఈ మాట అనొచ్చు తప్పేం లేదు. అయితే పాన్ ఇండియా రేంజిలో ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమాకు సంబంధించి తెలుగు కంటే హిందీ పాటలు, సంగీతమే బాగుంది అంటే ఎలా? ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఏ సినిమా గురించి చెబుతున్నామో. అవును ‘రాధేశ్యామ్’ గురించి ఇదంతా. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదలయ్యాయి. ఐదు భాషల్లో రెండేసి పాటలు రిలీజ్ చేశారు. తెలుగు గురించి చూస్తే… ‘ఈ రాతలే…’, ‘నగుమోము తారలే..’
అంటూ రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండింటికీ జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. తొలి పాటను యువన్ శంకర్ రాజా, హరిణి పాడితే… రెండోపాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. వాటికి సమాంతంగా హిందీలో ‘ఆషికీ ఆగయీ…’, ‘సోచ్ లియా’పాటలు వచ్చాయి. దీంతో పాటల మధ్య పోలికలు చూడటం మొదలైంది. ఈ క్రమంలో హిందీ పాటలే బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. మిథూన్ అందించిన సంగీతం… జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన మ్యూజిక్‌ను మించిపోయేలా ఉందని నెటిజన్ల టాక్.
ఇంకా కీన్‌గా అబ్జర్వ్ చేస్తే… హిందీ పాటల్లో సాహిత్యమే వినసొంపుగా ఉందని కూడా అంటున్నారు. దాని మీద మన డిస్కషన్ పెట్టడం సరికాదు. అయితే వినసొంపుగా ఉండే విషయంలో మాత్రం హిందీ పాటలు బాగున్నాయని చెప్పొచ్చు. మరి మిగిలిన పాటల విషయంలో హిందీని సౌత్ ట్యూన్స్ బీట్ చేస్తాయేమో చూడాలి.