అశోక్ గల్లా డెబ్యూ వర్కౌట్ అయ్యేలా ఉందే..!

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘అమర రాజా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్’ పతాకం పై పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతుంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌ ను కూడా విడుదల చేశారు.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి హీరో అశోక్ గల్లా మరియు ‘హీరో’ టీమ్‌ మొత్తానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే… సినిమా హీరో కావాలని కలలు కనే ఓ కుర్రాడిగా అశోక్ గల్లా…. అతన్ని ఎంకరేజ్ చేసే తల్లిగా పవిత్రా లోకేష్ కనిపిస్తుండగా అతన్ని తిట్టి పోసే తండ్రి పాత్రలో నరేష్ కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తండ్రిగా జగపతి బాబు కనిపిస్తుండడం విశేషం.

అశోక్ రకరకాల గెటప్ లలో కనిపిస్తూ అలరిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు, రన్నింగ్ ఇలా అన్ని విధాలుగా అశోక్ లుక్ ఆకర్షిస్తుంది. కథలోని లోతుని అంతగా చూపించలేదు కానీ కామెడీ కూడా ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని స్పష్టమవుతుంది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిధి – అశోక్ ల మధ్య వచ్చే లిప్ లాక్ ట్రైలర్ కి హైలెట్ గా నిలుస్తుంది. సంక్రాంతికి ఇలాంటి కమర్షియల్ గా సాగే వినోదాత్మక చిత్రాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి..

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి ఫలితాన్నే నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!


ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.