Avasarala Srinivas: అవసరాల బట్టతల కష్టాలు భలే ఉన్నాయే!

ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు నవ్వులపువ్వులు పూయించింది. ట్రైలర్ లో బట్టతలను కవర్ చేస్తూ విగ్ పెట్టుకుని తిరిగే హీరో పడే కష్టాలను ఫన్నీగా చూపించారు. అవసరాల తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేమించిన యువతి ముందు బట్టతలను కవర్ చేస్తూ అవసరాల పడే కష్టాలతో పాటు సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నట్టు ట్రైలర్ లో చూపించారు.

“ఇవ్వడానికి బట్టతల తప్ప ఏమీ లేనప్పుడు ఎందుకు కన్నట్టమ్మా” అనే డైలాగ్ నిజ జీవితంలో బట్టతల్ల వల్ల కష్టాలు పడే వాళ్ల గురించి ఆలోచింపజేస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో హిందీ మూవీ బాల ఛాయలు కనిపిస్తున్నాయి. బాల సినిమాకు నూటొక్క జిల్లాల అందగాడు రీమేకా..? కాదా..? తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే అవసరాల ఖాతాలో మరో హిట్ గ్యారంటీ అని అర్థమవుతోంది.

ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు నూటొక్క జిల్లాల అందగాడు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రాచకొండ విద్యాసాగర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో జె.సాయిబాబు – వై.రాజీవ్ రెడ్డి – శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.